ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్స్ గడువు పొడిగింపు, ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటన

Andhra Pradesh, AP Inter Admission 2021, AP Inter Admission Date Extended, AP Inter Online Admission, AP Inter Online Admission 2020-21, AP Intermediate Online Admission, AP intermediate online admission 2021-22, First Phase Online Admissions Registration Submission Date, First Phase Online Admissions Registration Submission Date Extended, First Phase Online Admissions Registration Submission Date Extended to AUG 27th, Mango News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీయట్ అడ్మిషన్స్ (ప్రవేశాలు) ఆన్‌లైన్ విధానం ద్వారా చేపడుతున్న సంగతి తెలిసిందే. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ తోలి దశ ఆన్‌లైన్ అడ్మిషన్స్ (ప్రవేశాలకు) ను ఆగస్టు 13 నుంచి ప్రారంభించారు. ముందుగా ఆగస్టు 23, సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటించింది. కాగా ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్స్ నమోదు గడువును పొడిగిస్తునట్టు తాజాగా ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఆగస్టు 27, సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. https ://bie.ap.gov.in వెబ్ సైట్లో అన్ని వివరాలు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఫీజు కింద ఎస్సీ/ఎస్టీ/పీహెఛ్ విద్యార్థులు రూ.50, ఓసీ/బీసీ విద్యార్థులు రూ.1000 చెల్లించాలని తెలిపారు. విద్యార్థులకు లేదా తల్లిదండ్రులకు ఈ అడ్మిషన్స్ ప్రక్రియపై ఏమైనా సందేహాలు ఉంటే 24/7 టోల్ ఫ్రీ నెంబర్ 18002749868 ను సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు ఏపీ ఇంటర్ బోర్డు సెక్రటరీ వి.రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − thirteen =