టీఎస్‌ ఎడ్‌సెట్‌-2023 షెడ్యూల్ విడుదల, మే 18న పరీక్ష

TS EdCET-2023 Schedule Released, Entrance Exam to be held on May 18th

తెలంగాణ రాష్ట్రంలో రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ ఎడ్‌సెట్‌-2023 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ శనివారం విడుదలైంది. ఈ షెడ్యూల్ ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, మ‌హాత్మాగాంధీ వ‌ర్సిటీ వీసీ సీహెచ్ గోపాల్ రెడ్డి, టీఎస్ ఎడ్‌సెట్-2023 కన్వీనర్ ప్రొఫెసర్ ఎ.రామకృష్ణతో కలిసి విడుదల చేశారు. 2023 సంవత్సరానికి గానూ ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్షను మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎడ్‌సెట్‌-2022 ప్రవేశ పరీక్ష కోసం మార్చి 6 నుంచి ఆన్‌లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా, ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 20 వరకు స్వీకరించనున్నారు. ఇక మే 18వ తేదిన ఎడ్‌సెట్‌-2023 ప్రవేశపరీక్షను నిర్వహించనున్నారు.

టీఎస్ ఎడ్‌సెట్‌-2023 పరీక్షషెడ్యూల్:

  • నోటిఫికేషన్‌ విడుదల: మార్చి 4
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: మార్చి 6
  • దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ (ఆలస్య రుసుము లేకుండా): ఏప్రిల్ 20
  • ఆలస్య రుసుము రూ.250 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 25
  • సబ్మిట్ చేసిన దరఖాస్తును ఎడిట్ చేసుకునే అవకాశం: ఏప్రిల్ 30
  • హాల్ టికెట్స్ డౌన్ లోడ్ : మే 5నుండి
  • ఎడ్‌సెట్‌ పరీక్ష నిర్వహణ తేదీ: మే 18
  • ప్రిలిమినరీ కీ ప్రకటన : మే 21.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 12 =