తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు, జూన్‌ 1 నుంచి తరగతులు

Telangana Inter Board Secretary Naveen Mittal Released The First Year Admission Schedule of Intermediate,Telangana Inter Board Secretary Naveen Mittal,Naveen Mittal Released The First Year Admission Schedule,The First Year Admission Schedule of Intermediate Was Released,Mango News,Mango News Telugu,TS Intermediate Education,First Year Admission Schedule of Inermediate,Telangana Inter Board Secretary Latest News,Telangana Inter Board Secretary Latest Updates,TS Intermediate Latest News And Updates

తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ప్రకటించారు. శుక్రవారం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాల షెడ్యూల్‌ను ఆయన విడుదల చేశారు. ఏ సందర్భంగా నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీలు ఇంటర్‌ ఫస్టియర్‌ కోసం ఈ నెల 15 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలని, జూన్‌ 30లోగా పూర్తి చేయాలని తెలిపారు. అలాగే జూన్‌ 1 నుంచి ఫస్టియర్‌ తరగతులు ప్రారంభించాలని, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కాగా విద్యార్థులు మాత్రం ఇంటర్‌ బోర్డ్‌ గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే చేరాలని, వాటి జాబితాను త్వరలోనే టీఎస్‌బీఐఈ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతామని పేర్కొన్నారు.

ఇక సీట్ల కేటాయింపులో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, బీసీలకు 29%, ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం చొప్పున ఎలాట్ చేయాలని.. అలాగే ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌, ఇతర అర్హతలున్న వారికి 5%, వికలాంగులకు 3%, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3% వంతున రిజర్వేషన్స్ కల్పించాలని కళాశాలల యాజమాన్యాలను ఆదేశించారు. ఇందులో బాలికలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని, ప్రతీ కాలేజీ దీనిని పాటించాలని స్పష్టం చేశారు. ప్రతీ సెక్షన్‌లో 88 మంది విద్యార్థులనే చేర్చుకోవాలని, ఒకవేళ అదనపు సెక్షన్లు ఏర్పాటు చేయదలచుకుంటే బోర్డ్‌ అనుమతి తీసుకోవాలని సూచించారు. ఇంకా ప్రతి విద్యార్థి ఆధార్‌ నెంబర్‌ తప్పనిసరిగా నమోదు చేయాలని, అడ్మిషన్ల వివరాలను నిత్యం కాలేజీ బోర్డుపై అందరికీ అందుబాటులో ఉంచాలని కోరారు. అలాగే జోగిని లేదా తండ్రిలేని పిల్లల విషయంలో పేరెంట్స్‌ కాలమ్‌లో తల్లి పేరు నమోదు చేయాలని, కాలేజీలలో బాలికలకు అన్నిరకాల రక్షణ వ్యవస్థను యాజమాన్యాలు కల్పించాలని స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE