మంత్రి కేటీఆర్‌ యూకే పర్యటన.. లండన్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌తో కీలక ఎంవోయూ, హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటు

Minister KTR UK Trip London Stock Exchange Signs on MoU For Setting up Technology Center in Hyderabad,Minister KTR UK Trip,London Stock Exchange Signs on MoU,Technology Center in Hyderabad,Mango News,Mango News Telugu,KTR UK Trip,KTR UK Trip Latest News And Updates,London Stock Exchange,London Stock Exchange Latest News And Updates,Minister KTR Latest News And Updates,Technology Centre in Hyderabad Latest News,MoU,MoU Latest News And Updates

తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా యూకే పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు అక్కడి ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలుసుకుంటున్నారు. అలాగే ప్రతిష్టాత్మక కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో లండన్‌ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లండన్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌ సంస్థను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణలో దూసుకుపోతోందని, పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, నూతన పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్‌ వివరించారు. దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు లండన్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌ ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఎంవోయూ కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్ సమక్షంలో.. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, తెలంగాణ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ ఎన్నారై అఫైర్స్‌ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి, ఆంథోనీ మెక్‌ కార్తీలు అవగాహన ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకొన్నారు. కాగా ఈ సెంటర్‌ ద్వారా హైదరాబాద్‌లోని బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ వంటి తదితర రంగాలకు విస్తృత సేవలు లభించనున్నాయి. ఈ ఒప్పందంతో ఒక్క ఏడాది వ్యవధిలో 1000 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు లండన్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌ తెలిపింది. సంస్థ ప్రకటనపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈ లండన్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజీకి ఘనమైన చరిత్ర ఉంది. బ్రిటన్‌ జనాభాలోని దాదాపు 15 శాతం మంది ఈ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌లో పెట్టుబడులు కలిగివున్నారు. ఇక యూరప్‌లో అతిపెద్ద స్టాక్‌ ఎక్స్‌చేంజీల్లో ఒకటైన ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో కస్టమర్లకు సేవలు అందిస్తుండటం గమనార్హం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =