ఈ నెలలోనే తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు, ఇంటర్ బోర్డు ప్రకటన

Inter Results 2020, Intermediate 2020 Results, Telangana Inter 2020 Results, Telangana Inter Results, Telangana Inter Results 2020, Telangana Intermediate 2020 Results, Telangana Intermediate Results, Telangana Intermediate Results 2020

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు జూన్ నెలలోనే విడుదల కానున్నాయి. ఇంటర్ పరీక్ష ఫలితాలను ఈ నెలలోనే వెల్లడించే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఈ రోజు తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలను ఒకేసారి ప్రకటించేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తుందని పేర్కొన్నారు. మే 12 నుంచి 30 వరకు వాల్యుయేషన్ పక్రియను పూర్తిచేశామని, ఫలితాల నమోదు ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుందన్నారు. స్కానింగ్, మార్క్స్ లోడింగ్, మెమో తయారీ తదితర అంశాలకు సంబంధించిన సాంకేతిక ప్రక్రియ జూన్15 నాటికి పూర్తయ్యే అవకాశముందని, అనంతరం ఫలితాలను వెల్లడిస్తామని ఉమర్ జలీల్ తెలిపారు. కాగా ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర పరీక్షల ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu