టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగుచూసిన నేపథ్యంలో అధికార పార్టీ మండిపడింది. దీనిపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, నేతలు స్పందించారు. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే కొనుగోలు రాజకీయాలకు బీజేపీ తెర తీసిందని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు విమర్శించారు. తెలంగాణాలో ప్రజల ఆమోదంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కారును పడగొట్టాలని కుట్ర చేశారని, దీనిలో భాగంగానే ఒక్కో ఎమ్మెల్యేను రూ.100 కోట్లకు కొనాలని చూశారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి, రోహిత్ రెడ్డిలకు పెద్ద మొత్తంలో డబ్బు ఆశచూపారని, అయితే తమ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాగా అమ్ముడుపోరని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరే ఇక్కడ కూడా కుట్రలతో ప్రభుత్వాన్ని పడగొడదామని చూశారని, అయితే సీఎం కేసీఆర్ ముందు వారి ఆటలు సాగవని, ఈ చర్యతో బీజేపీ దేశవ్యాప్తంగా నవ్వులపాలైందని టీఆర్ఎస్ నేతలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY