మునుగోడు నియోజకవర్గం మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ, 500 రోజుల్లో అభివృద్ధికి ప్రణాళిక

BJP Releases Manifesto for Munugode Bye-election Issued Development Plan for the 500 Days, BJP Releases Manifesto Munugode Bye-election, Munugode Development Plan For BJP,BJP Development Plan for 500 Days, Mango News,Mango News Telugu, TRS Party Munugode By-Poll, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates

మునుగోడు ఉపఎన్నిక ప్రచారం రోజురోజుకి మరింత వేడెక్కుతుంది. ముఖ్యంగా బీజేపీకి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సహా రాష్ట్రస్థాయి నేతలంతా మునుగోడు నియోజకవర్గంలోనే విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నికకు బీజేపీ‌ బుధవారం నాడు మేనిఫెస్టోను విడుదల చేసింది. మునుగోడు నియోజకవర్గం మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎంపీ వివేక్, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వచ్చే 500 రోజుల్లో మునుగోడు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులతో మెగా మాస్టర్ ప్లాన్ కింద మేనిఫెస్టోను విడుదల చేశారు. గత ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ చేయలేని అభివృద్ధి పథకాలను కేవలం ఒక ఏడాదిన్నర కాలంలో కేంద్ర నిధులతో సాధించే సమగ్ర అభివృద్ధి ప్రణాళికను ప్రజల ముందు ఉంచుతున్నట్టు బీజేపీ నేతలు పేర్కొన్నారు.

బీజేపీ విడుదల చేసిన మునుగోడు నియోజకవర్గం మేనిఫెస్టో:

  1. 200 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో రోడ్ల అభివృద్ధి
  2. టెక్స్ టైల్ పార్కు – చేనేత కార్మికులను ఆదుకొని వారికి ఉపాధి చూపించడమే లక్ష్యంగా కేంద్ర టెక్స్
  3. టైల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వంద కోట్ల పెట్టుబడితో సంస్థాన్ నారాయణపుర్ మండల కేంద్రంగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు
  4. ఫ్లోరైడ్ నివారణకు మునుగోడులో పరిశోధన కేంద్రం
  5. రూ.25 కోట్లతో చౌటుప్పల్ లో ఐటీఐ అభివృద్ధి
  6. మర్రిగూడకు నవోదయ పాఠశాల కేటాయింపు
  7. సత్వరసాగు నీటి ప్రయోజన పథకం:కేంద్ర జలశక్తి శాఖ సత్వరసాగు నీటి ప్రయోజన పథకం ద్వారా సుమారు 100 కోట్లతో మూసినది నీళ్లను ఎత్తిపోతల ద్వారా చౌటుప్పల్ మండలంలోని వివిధ చెరువులను నింపే కార్యక్రమం
  8. ఉద్యోగ మేళాలు : మునుగోడు నియోజకవర్గంలోని వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి అవసరమైన నైపుణ్య శిక్షణ
  9. నిరుద్యోగులకు రుణాలు : మునుగోడు నియోజకవర్గంలోని నిరుద్యోగులకు స్వంత వ్యాపారాలు నెలకొల్పటానికి లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి వివిధ బ్యాంకులలో ఇది వరకే దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా రుణాలు ఇప్పించడం
  10. నైపుణ్య అభివృద్ధి కేంద్రం : మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగులకు ఉపాధి లభించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ నైపుణ్య అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చండూర్ మండల కేంద్రంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు
  11. వీధి వ్యాపారులకు స్వనిధి పథకం ద్వారా ఆర్ధిక సాయం
  12. చౌటుప్పల్ లో 10 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం
  13. పర్యాటక కేంద్రంగా రాచకొండ ప్రాంతం
  14. మండల కేంద్రాలలో అదనపు ప్రభుత్వ బ్యాంకు శాఖల ఏర్పాటుకు చర్యలు
  15. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ వాటి అభివృద్ధి :మునుగోడు నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలన్నింటినీ నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో అన్ని మౌలిక వసతులు కల్పించి ఆధునిక హంగులతో డిజిటలైజేషన్ చేయడంతో పాటు టెలి మెడిసిన్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు
  16. అమృత సరోవర్ పథకం ద్వారా ట్యాంకుల నిర్మాణం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =