తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 5093 మందికి పాజిటివ్

Telangana Records 5093 New Covid-19 Positive Cases on April 17

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 5093 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో శనివారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,51,424 కి చేరింది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో పదిహేనుమంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1824 కి పెరిగింది. కొత్తగా 1555 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి 3,12,563 కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 743 నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (ఏప్రిల్ 18, రాత్రి 8 గంటల వరకు):

  • రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,17,37,753
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 3,51,424
  • కొత్తగా నమోదైన కేసులు : 5093
  • నమోదైన మరణాలు : 15
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 3,12,563
  • కరోనా రికవరీ రేటు: 88.94%
  • యాక్టీవ్ కేసులు: 37,037
  • హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్‌లో ఉన్నవారి సంఖ్య: 24,156
  • నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 1,824
  • కరోనా మరణాల రేటు: 0.51%
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ