రాష్ట్రంలో పాఠశాలలకు దసరా పండుగ సెలవులపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ బుధవారం స్పష్టత ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ 2022-23 ప్రకారం సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు 14 రోజులు పాటుగా ప్రకటించిన దసరా పండుగ సెలవుల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సహా ఇతర యాజమాన్యాల పరిధిలోని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్ కు అకడమిక్ క్యాలెండర్ 2022-23 ప్రకారం ఈనెల 26 నుంచి అక్టోబర్ 9 వరకు దసరా సెలవులు ప్రకటించామని, అవి యథాతథంగా అమలు అవుతాయని ఎలాంటి మార్పులు లేవని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఒక ప్రకటన విడుదల చేశారు.
ముందుగా జూలైలో వర్షాలు కారణంగా సెలవులు ఇవ్వడంతో పాటుగా, సెప్టెంబర్ 17న పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో అకడమిక్ క్యాలెండర్ 2022-23లో ఏడు రోజులు పనిదినాలు తగ్గాయని, వాటిని భర్తీ చేసేందుకు ఎస్‌సీఈఆర్‌టీ రెండు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. దసరా పండుగ సెలవులను 14 రోజుల నుంచి 9 రోజులకు తగ్గించి అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులు ఇస్తే ఐదు పనిదినాలు భర్తీ చేయొచ్చని లేదా 2022 నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండో శనివారాలు కూడా పాఠశాలలు పనిచేసేలా చేస్తే ఐదు రోజులు కలిసి వస్తాయని ఎస్‌సీఈఆర్‌టీ ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు ఉంచింది. ఈ క్రమంలో ఆ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ ముందుగా ప్రకటించిన విధంగానే దసరా సెలవులు అమలు అవుతాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY







































