మహిళల టీ20 ఆసియా కప్​: 15మందితో జట్టును ప్రకటించిన బీసీసీఐ, షెడ్యూల్ ఇదే!

BCCI Announces Team India's 15-Member Squad For Women's Asia Cup 2022, Women's Asia Cup 2022, Indian Squad for Women's Asia Cup 2022, Harmanpreet Kaur (Captain), Smriti Mandhana (vice-captain), Deepti Sharma, Shafali Verma, Jemimah Rodrigues, Sabbineni Meghana, Richa Ghosh (wicket-keeper), Sneh Rana, Dayalan Hemalatha, Meghna Singh, Renuka Thakur, Pooja Vastrakar, Rajeshwari Gayakwad, Radha Yadav, K.P. Navgire

పురుషుల టీ20 ఆసియా కప్ ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహిళల టీ20 ఆసియా కప్ టోర్నీకి వేళయింది. అక్టోబర్​ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్​ అక్టోబర్ 15వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా మహిళల జట్టును ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా తెలిపింది. బంగ్లాదేశ్‌లో జరుగనున్న ఈ మెగా టోర్నీకి టీమిండియాకు హర్మన్​ ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. ఆసియా కప్ లో ఇండియాతో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈ, థాయ్‌లాండ్, మలేషియా జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీని రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. దీనిలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇక అక్టోబర్ 1న భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా, అక్టోబర్ 7న పాకిస్థాన్‌తో భారత్ కీలక మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 11వ తేది వరకు లీగ్ స్టేజ్ మ్యాచ్​లు జరగనుండగా, 13న సెమీ ఫైనల్, 15న ఫైనల్​ మ్యాచ్​లు జరగనున్నాయి. ఇప్పటివరకు భారత్ ఆరుసార్లు అత్యధికంగా టైటిల్ గెలవగా, ప్రస్తుతం బంగ్లాదేశ్​లో జరుగుతున్నది 8వ ఎడిషన్.

బీసీసీఐ ఎంపిక చేసిన ఆసియా కప్ మహిళల జట్టు

భారత జట్టు: హర్మన్​ ప్రీత్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, శఫాలీ వర్మ, జెనిమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, రిచా ఘోష్​(వికెట్ కీపర్), స్నేహ్ రానా, దయలన్ హేమలత, మేఘన సింగ్, రేనుకా థాకూర్, పూజ వస్త్రాకర్, రాజేశ్వరీ గైక్వాడ్​, రాధా యాదవ్, కేపీ నవ్​గిరే.

స్టాండ్​బై ప్లేయర్స్: తనియా సప్న భాటియా, సిమ్రన్ దిల్ బహదూర్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =