తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత ప్రారంభం

Secretariat Demolition, telangana, Telangana govt begins demolishing Secretariat, Telangana New Secretariat, Telangana News, Telangana Political Updates, telangana secretariat, Telangana Secretariat Demolition, Telangana Secretariat Demolition Process Started

తెలంగాణ సచివాలయం కూల్చివేత నిర్ణయంపై ఇటీవల హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన తెలిసిందే. కూల్చివేతపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ, ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తుది తీర్పు వెలువరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన నూతన సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. ఈ నేపథ్యంలో పాత సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ జూలై 7, మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. సచివాలయం వైపుగా రాకపోకలు నిలిపివేసి, అటు వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేశారు. కూల్చివేత పనులు జరుగుతుండడంతో పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సచివాలయంలోని సీ బ్లాక్‌ కూల్చివేత పక్రియ కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu