గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆ మూడు జిల్లాల్లో రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Govt Declared Holiday on SEP 9 for Hyderabad Rangareddy Medchal Malkajgiri Districts Due to Ganesh Idols Immersion, Telangana Govt Declared Holiday on SEP 9, Telangana Govt Declared Holiday on Ganesh Idols Immersion, SEP9 Telangana Govt Holiday, Ganesh Idols Immersion on SEP 9 , Mango News, Mango News Telugu, Ganesh Idols Immersion on SEP9 , Hyderabad Rangareddy Medchal Districts Govt Holiday, Telangana Govt Declared Holiday , Telangana Govt Declared Holiday on SEP 9, Ganesh Idols Immersion Hyderabad, Ganesh Idols Immersion News And Live Updates

వినాయక చవితి పండుగ సందర్భంగా ఆగస్టు 31న ప్రారంభమయిన గణేష్ ఉత్సవాలు రేపు (సెప్టెంబర్ 9, శుక్రవారం) జరిగే నిమజ్జన శోభాయాత్రలతో ముగియనున్నాయి. నగరంలో రేపు నిర్వహించే గణేష్ నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్‌ వద్ద ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా సెప్టెంబర్ 9, శుక్రవారం నాడు హైదరాబాద్‌, సికింద్రాబాద్ జంటనగరాలతో పాటుగా రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలో సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మూడు జిల్లాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా సెప్టెంబర్ 9వ తేదీన సెలవు ప్రకటిస్తునందువలన, ఈ సెలవుకు బదులుగా ఈ మూడు జిల్లాల పరిధిలో నవంబర్ 12న రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటించిస్తునట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 11 =