తెలంగాణలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,861 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 5,09,275 విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని అధికారులు తెలిపారు. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత మొదటిసారిగా ప్రత్యక్షంగా పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో.. క్షేత్ర స్థాయి ఏర్పాట్లపై పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఆదివారం వర్చువల్ పద్ధతిలో అధికారులతో సమీక్షించారు. విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 8.30 గంటల నుంచి అనుమతిస్తామని వెల్లడించారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా నిఘా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,861 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేశారు. చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాను ఏర్పాటు చేసి అక్కడ ప్రశ్నపత్రాల బండిల్‌ను ఓపెన్ చేయనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాలలో కరోనా నిబంధనలను అమలు చేస్తున్నారు. పరీక్షా సెంటర్ల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ