సీఎం జగన్‌ దావోస్‌ పర్యటన: ఏపీ పెవిలియన్‌ ప్రారంభం.. డబ్ల్యూఈఎఫ్‌తో ప్లాట్‌ఫాం పార్ట్‌నర్‌గా ఒప్పందం

AP CM Jagan Inaugurates AP Pavilion and Holds Key Meetings Signs Agreements At Davos, AP CM Jagan Inaugurates AP Pavilion and Holds Key Meetings, AP CM Jagan Signs Agreements At Davos, AP CM Jagan Holds Key Meetings, AP CM Jagan Inaugurated AP Pavilion, AP CM Jagan Launches AP Pavilion, Davos Tour, AP CM YS Jagan Davos Tour, AP CM YS Jagan Davos Tour News, AP CM YS Jagan Davos Tour Latest News, AP CM YS Jagan Davos Tour Latest Updates, AP CM YS Jagan Davos Tour Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, AP CM, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి దావోస్‌ పర్యటనలో తొలిరోజు బిజీబిజీగా గడిపారు. పలు అంశాలపై అంతర్జాతీయ ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. దీనిలో భాగంగా.. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌)లో ఆదివారం ‘ఏపీ పెవిలియన్‌’ను ప్రారంభించారు సీఎం జగన్‌. ఈ ఏపీ పెవిలియన్.. పెట్టుబడుల ప్రవాహానికి రాష్ట్రంలోని అనుకూలమైన పరిస్థితులను తెలుపుతుంది. సుదీర్ఘ తీరప్రాంతం కారణంగా రాష్ట్రం కలిగి ఉన్న భౌగోళిక ప్రయోజనాన్ని హైలైట్ చేయడంతో పాటు ప్రభుత్వ వివిధ విధానాలను వివరిస్తుంది. అలాగే దావోస్‌లో ఏపీ తరపున పలు కీలక సమావేశాలు, ఒప్పందాలపై సంతకాలు చేశారు.

ఈ క్రమంలో దావోస్‌లోని కాంగ్రెస్‌ సెంటర్లో డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ క్లాజ్‌ ష్వాప్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. డబ్ల్యూఈఎఫ్‌ యొక్క కార్యక్రమాలు మరియు ప్రాజెక్టులతో ఏపీకి మెరుగైన అనుసంధానం మరియు సమన్వయం కోసం ప్రొఫెసర్ క్లాస్ స్క్వాబ్‌తో కీలక ఒప్పందంపై సంతకం చేశారు. ఈ సందర్భంగా క్లాజ్‌ మాట్లాడుతూ.. ఫుడ్‌ హబ్‌గా మారేందుకు ఏపీకి మెరుగైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ భాగస్వామ్యంపై డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం చేసుకుంటున్నందుకు ఏపీని అభినందించారు. కొత్తగా నిర్మిస్తున్న మూడు పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం, అభివృద్ధిపై సీఎం జగన్ వివరించారని పేర్కొన్నారు.

అలాగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఆరోగ్య- వైద్య విభాగాధిపతి డాక్టర్‌ శ్యాం బిషేన్‌తో కూడా ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఏపీలో ప్రతి 2,000 జనాభాకు వైఎస్సార్‌ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేశామని, ఇంకా పౌరులందరికీ ప్రయోజనం చేకూర్చే పథకాలు మరియు సేవల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ/వార్డు సెక్రటేరియట్‌ల వ్యవస్థ నిర్మించామని తెలియజేశారు. ఏపీలో ఆరోగ్య రంగంలో అమలు చేస్తున్న విప్లవాత్మక మార్పులను, ప్రజల కోసం కొత్తగా నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులను గురించి వివరిస్తూ, ఈ కార్యక్రమాల్లో డబ్ల్యూఈఎఫ్‌ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా బీసీజీ గ్లోబల్‌ చైర్మన్‌ హాన్స్‌ పాల్, అదానీ గ్రూపు సంస్థల చైర్మన్‌ గౌతం అదానీలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు వారిని ఆహ్వానించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =