పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు హర్షణీయం, కేంద్రమార్గాన్ని వైసీపీ ప్రభుత్వం అనుసరించాలి: పవన్ కళ్యాణ్

Pawan Kalyan Demands AP Govt to Follow to Central Govt Way on Reducing Petrol Diesel Prices, AP Govt to Follow to Central Govt Way on Reducing Petrol Prices, AP Govt to Follow to Central Govt Way on Reducing Diesel Prices, Pawan Kalyan Demands AP Govt to Follow to Central Govt Way, Pawan Kalyan, Jana Sena chief Pawan Kalyan, JanaSena Party chief Pawan Kalyan, JanaSena Party President Pawan Kalyan, Reducing Petrol Prices, Reducing Diesel Prices, AP Govt to Follow to Central Govt Way, Petrol Price to Reduce by Rs 9.5 per Litre, Diesel by Rs 7 after Centre Cuts Excise Duty, Centre Cuts Excise Duty, Fuel Pricies Reduced, Excise Duty, Petrol Price to Drop by Rs 9.5 Per Litre, Petrol price cut by Rs 9.5/litre, Petrol to get cheaper by Rs 9.5, Fuel Pricies Reduced News, Fuel Pricies Reduced Latest News, Fuel Pricies Reduced Latest Updates, Fuel Pricies Reduced Live Updates, Mango News, Mango News Telugu,

దేశంలో రోజురోజుకి పెరుగుతున్న ధరల దాడికి బెంబేలెత్తిపోతున్న ప్రజలకు పెట్రోలు, డీజిల్ రేట్ల తగ్గింపు ఉపశమనం ఇస్తుందని భావిస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “పెట్రోలు, డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంలోని అధినాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనసారా ఆహ్వానిస్తున్నాను. ఫలితంగా పెట్రోలు రూ.9.50 పైసలు, డీజిల్ రూ.7 వరకు తగ్గడం హర్షణీయం. నిత్యావసర ధరల పెరుగుదలకు ఇంధన రెట్లే కారణమన్న సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో నిత్యావసర వస్తువుల ధరలు కొంత వరకు తగ్గే అవకాశం ఉండడం అల్పాదాయ, మధ్య తరగతి ప్రజలకు కొంత స్వాంతన కలిగిస్తుందని భావిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

“పీఎంఉజ్వల యోజన పథకంలో అందించే గ్యాస్ సిలిండర్లపై రూ.200 తగ్గించడం పేదవారికి ఆర్థికంగా మేలు చేకూరుస్తుంది. కేంద్ర ప్రభుత్వ బాటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరించాలని కోరుతున్నాను. ఇంధన ధరలపై స్థానిక పన్నులు అన్ని రాష్ట్రాలలో కంటే ఆంధ్రప్రదేశ్ లోని అధికంగా ఉన్నాయి. అసలే అస్తవ్యస్థమైపోయి ధ్వంసమైన రోడ్లతో ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయాణం భారంగా మారి వాహనాలు మరమ్మతులకులోనై అల్లాడిపోతున్నారు. పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై రోడ్డు సెస్ పేరుతో ప్రజల నుంచి ఏటా రూ. 600 కోట్లు వసూలు చేస్తోంది. అయినా రోడ్లను బాగు చేసే పరిస్థితి ప్రస్తుతం ఎలాగూ కనిపించడం లేదు. కనీసం పెట్రోలు, డీజిల్ పై స్థానిక పన్నులను తగ్గించి ఊరట కలిగించాలని ప్రజలు చేస్తున్న డిమాండును వైసీపీ సర్కారు నెరవేర్చాలని కోరుతున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + nine =