థియేటర్స్ తెరిచేందుకు సిద్ధం, ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి

Hyderabad Theatre Open, Multiplex Association, Telangana Theatre, Telangana Theatre Open, Telangana Theatre Owners, Telangana Theatre Owners Association, Telangana Unlock 5, Telangana Unlock 5 Guidelines, Telangana Unlock 5 News, Telangana Unlock 5 Updates, Theatre Owners Association Decided to Reopen Theaters

ఇటీవల జారీచేసిన అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాల్లో భాగంగా 50 సీటింగ్ సామర్థ్యంతో అక్టోబర్ 15‌ నుంచి సినిమా థియేటర్లు తెరవడానికి కేంద్రప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో థియేటర్లు తిరిగి ప్రారంభించే అంశంపై చర్చించేందుకు తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్‌లో సమావేశమయ్యింది. అనంతరం అసోసియేషన్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ, అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్ల తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. ఓనర్స్ అసోసియేషన్ సభ్యులంతా థియేటర్స్ తెరవాలని నిర్ణయించామని అన్నారు.

అలాగే ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇవ్వాలని కోరారు. కరెంట్, పార్కింగ్ సహా కొన్ని విషయాల్లో సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. థియేటర్ లో సీటు వదిలి సీటు కేటాయించి, ప్రక్కన  సీటు ఖాళీగా ఉండేలా టికెట్స్ జారీ చేస్తామన్నారు. శానిటైజర్లు అందుబాటులో ఉంచబడతాయని, సినిమాకి వచ్చే ప్రేక్షకులు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటామని అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu