తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు జరగనుంది. కౌంటింగ్ ఏర్పాట్లను ఎన్నికల అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కానుండగా, ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి, అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. నాగార్జునసాగర్ లో స్థానంలో 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాగర్ లో మొత్తం 25 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుండగా, ఒక్కో రౌండ్ లో 14 టేబుల్స్ పై కౌటింగ్ జరుగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా కౌంటింగ్ హాల్లోకి వచ్చే అభ్యర్థులు మరియు ఏజెంట్స్ కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఇక తిరుపతి పోరులో 28 మంది బరిలో నిలిచినప్పటికీ ముఖ్యంగా ప్రధాన పార్టీలైన వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీల మధ్యే త్రిముఖ పోరు నెలకుంది. వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థిగా ఎం.గురుమూర్తి, టీడీపీ తరుపున పనబాక లక్ష్మీ, బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఎఎస్ అధికారిని రత్నప్రభ ఈ ఉపఎన్నికల్లో బరిలో నిలిచి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మూడు పార్టీల కీలక నేతలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో ఈ ఉపఎన్నికపై ప్రజల్లో ఆసక్తి నెలకుంది. ఇరు స్థానాల్లో కూడా మధ్యాహ్నంలోగానే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఉపఎన్నికల్లో ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపారో మరికొన్ని గంటల్లో తేలనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ