మే 4 నుండి భారత్ నుంచి వచ్చే విమానాలపై పరిమితులు విధిస్తూ అమెరికా నిర్ణయం

US Imposed Restrictions on Travel From India From May 4,Mango News,Mango News Telugu,Coronavirus In India,Coronavirus India Live Updates,Coronavirus Live Updates,COVID-19,COVID-19 Cases in India,COVID-19 Daily Bulletin,Covid-19 In India,Covid-19 Latest Updates,COVID-19 New Live Updates,India Coronavirus,India COVID 19,Coronavirus Latest News Updates,US,US Imposed Restrictions On Travel,US Imposed Travel From India From May 4,Coronavirus Second Wave In India,US Imposes Restrictions On Travel From India Beginning May 4,India Travel Ban By US,US To Restrict Travel From India From May 4,Covid-19 Surge,Travel From India To US To Be Restricted From May 4,US Curbs Travel From India From May 4,US Travel Ban India

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతితో రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూకే, యుఎఇ, కెనడా, న్యూజిలాండ్, హాంకాంగ్ వంటి పలు దేశాలు భారత్ నుంచి విమానాల రాకపోకలపై ఇప్పటికే తాత్కాలిక నిషేధం విధించగా, తాజాగా ఈ జాబితాలోకి అమెరికా కూడా చేరింది. మే 4, మంగళవారం నుంచి భారత్ నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలపై పరిమితులు విధించనున్నట్లు అమెరికా ప్రకటించింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ), జాతీయ భద్రతా సలహాదారులు, కోవిడ్-19 నిపుణులు, వైద్య నిపుణుల సలహా మేరకు వచ్చే మంగళవారం నుండి భారత్ పై ప్రయాణ పరిమితులు అమల్లోకి వస్తాయని అమెరికా ప్రభుత్వ ప్రతినిధులు ప్రకటించారు.

అయితే ఈ పరిమితుల నుంచి కొన్ని వర్గాలకు మినహాయింపు ఇచ్చారు. విద్యార్థులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు మరియు కరోనా నియంత్రణకై కృషి చేస్తున్న వ్యక్తులకు మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్రెజిల్‌, చైనా, ఇరాన్‌, దక్షిణాప్రికాపై విధించిన ఆంక్షలు, మినహాయింపులు తరహాలోనే భారత్ పై కూడా అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 8 =