ఐదు రాష్ట్రాల్లో రేపే వెలువడనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

5 States Assembly Election Votes Counting Will Be Held Tomorrow,Mango News,Mango News Telugu,5 States Assembly Election Votes Counting,Assembly Election Votes Counting Will Be Held Tomorrow,Assembly Election Results 2021,Assembly Elections Results,Assembly Election Poll Results From Five Indian States,Election Results Updates,Assembly Election Live Updates,Assembly Election Results 2021 Highlights,Assembly Election Updates,Counting Of Votes In 5 States Tomorrow,Assembly Election Votes Counting Live,Assembly Election Live Latest,Assembly Election Live Latest Updates

దేశంలో పశ్చిమబెంగాల్‌, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలతో సహా శాసనసభ కలిగిన కేంద్రపాలితమైన పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ రేపు (మే 2, ఆదివారం) జరగనుంది. అలాగే వీటితో పలు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికలు ఫలితాలు కూడా రేపే వెలువడనున్నాయి. కౌంటింగ్ కోసం కరోనా నిబంధనలకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేసింది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కానుండగా, ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి, అనంతరం రౌండ్ల వారీగా ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు.

తమిళనాడులో 234, పశ్చిమబెంగాల్ ‌లో 294, కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశంలో ఆసక్తి నెలకుంది. ప్రజలు అధికార పార్టీల వైపు మొగ్గుచూపారా? కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. మరోవైపు దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మే 2న విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే కౌంటింగ్ పక్రియ సందర్భంగా అభ్యర్థులు, ఏజెంట్స్ పాటించాల్సిన నిబంధనలపై కూడా ఆదేశాలు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + eleven =