మరోసారి సత్తా చాటిన తెలంగాణ..

Top in GSDP Telangana has Shown its Strength, Telangana GSDP has Shown its Strength, Top in GSDP Telangana, Telangana GSDP, Telangana,Top in GSDP, Telangana has Shown its Strength,GSDP, Latest Telangana GSDP News, Telangana GSDP News Update, Latest GSDP News, Telangana, Mango News, Mango News Telugu
Telangana,Top in GSDP, Telangana has shown its strength,GSDP

2022-23లో 11.97% వృద్ధిరేటు సాధించి..  జీఎస్‌డీపీ అంటే స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో తెలంగాణ మరోసారి సత్తా చాటింది.2022-2023 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 11.97% వృద్ధిరేటును నమోదు చేసి.. రూ.3,08,732 కోట్ల జీఎస్‌డీపీతో మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో నిలిచింది.

తెలంగాణ రూ.3,08,732 కోట్ల జీఎస్‌డీపీ,కర్ణాటక   రూ.3,01,673 కోట్ల జీఎస్‌డీపీ, హర్యానా రూ.2,96,685 కోట్ల జీఎస్‌డీపీ, తమిళనాడు రూ.2,73,288 కోట్ల జీఎస్‌డీపీ, మహారాష్ట్ర రూ.2,42,247 కోట్ల జీఎస్‌డీపీ, ఉత్తరాఖండ్ రూ.2,33,565 కోట్ల జీఎస్‌డీపీ, ఆంధ్రప్రదేశ్  రూ.2,19,518 కోట్ల జీఎస్‌డీపీ , పంజాబ్ రూ.1,73,873 కోట్ల జీఎస్‌డీపీ, రాజస్థాన్ రూ.1,56,149  కోట్ల జీఎస్‌డీపీ, మధ్యప్రదేశ్ రూ.1,40,583కోట్ల జీఎస్‌డీపీని నమోదు చేశాయి.

మాజీ సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల వల్ల  తొమ్మిదిన్నర ఏళ్లలో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి పెరగడంతో అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపే చూస్తున్నాయి.  కేసీఆర్ హయాంలో వ్యవసాయ, మౌలిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించడం వల్లనే ఇది సాధ్యమైందని విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ఈ జాబితాలో ఏపీ కూడా టాప్‌-10లోనే  ఉండగా.. తెలంగాణ తర్వాత కర్ణాటక, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY