గమ్యస్థానానికి చేరువలో ఆదిత్య L1

Aditya L1 on Approach to Destination, Aditya L1 on Approach, L1 on Approach to Destination, Aditya L1 Destination, ISRO, Space Protector, Aditya L1, ISRO Chairman Som Nath, Latest Aditya L1 News, Aditya L1 News Update, Latest Space News, Space Technology News, Technology, Aditya L1 Success, Mango News, Mango News Telugu
ISRO ,Space Protector,Aditya L1 on approach to destination,Aditya L1 ,ISRO Chairman Som Nath

సూర్యునిపై నిరంతర అధ్యయనానికి ప్రయోగించిన ఆదిత్య L1.. ఇప్పుడు గమ్యస్థానానికి అత్యంత చేరువలో ఉందని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్  చెప్పారు. జనవరి 6న అంటే రేపు సాయంత్రం 4 గంటలకు  ఆదిత్య L1 తన గమ్యస్థానమైన లెగ్రాంజ్ పాయింట్ 1 ను చేరుకుంటుందని తెలిపారు. సెప్టెంబర్ 23వ తేదీ 2023 న  PSLV-C57 రాకెట్‌లో సూర్యుని గురించి నిరంతర అధ్యయనానికి ఆదిత్య L1 ను ఇస్రో ప్రయోగించింది. సూర్యుడి బయటి పొర అయిన కరోనల్ మాస్‌తో పాటు.. పరిసర ప్రాంతాలను కూడా అధ్యయనం చేయడానికి దీనిని ప్రయోగించింది.  1.5 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తన గమ్యస్థానం  లెగ్రాంజ్ పాయింట్ 1 ను  రేపు  సాయంత్రం చేరుకోబోతోంది.

లాగ్రాంజ్ పాయింట్ వద్ద ఆదిత్య ఎల్ 1 ఉంచినప్పుడు అది భూమికి, సూర్యునికి మధ్య దూరంలో  1.5 మిలియన్ కిలోమీటర్ల వద్ద ఉండి..తన అధ్యయనం కొనసాగిస్తుంది. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనల్ మాస్‌తో పాటు సూర్యుని బయటి పొరలపై ఇది లోతైన అధ్యయనం చేయనుంది. భూమికి, సూర్యునికి మధ్య గురుత్వాకర్షణ సమతుల్యం ఉన్న ప్రాంతం అయిన లాగ్రాంజ్ పాయింట్ 1 అధ్యయనం కోసం స్థిరమైన స్థానాన్ని అందిస్తుంది.  5.2 సంవత్సరాల పాటు లాగ్రాంజ్ పాయింట్ వద్ద ఆదిత్య ఎల్ 1.. సూర్యుని గురించి అధ్యయనం చేస్తుంది.  ఆ తర్వాత దీనిని పొడిగించే అవకాశం ఉందని ఇస్రో తెలిపింది.

సూర్యుడిపై ఆదిత్య ఎల్1 ఎల్లప్పుడూ  కన్నేసి ఉంచుతుంది కాబట్టి.. సూర్యునిపై ఏర్పడే సౌర విద్యుదయస్కాంత ప్రభావాల గురించి ముందుగానే హెచ్చరిస్తుందని శాస్త్రవేత్తలు  చెబుతున్నారు. అంతేకాదు..మన ఉపగ్రహాలకు, కమ్యూనికేషన్ వ్యవస్థకు నష్టం కలగకుండా కాపాడుతుంది. దీనితో పాటు సౌర తుఫానులు దాటిపోయేంత వరకు మన ఉపగ్రహాలకు  ఎలాంటి  విఘాతం కలగకుండా, సేఫ్టీ మోడ్‌లో ఉంచడానికి ఇది సాయపడుతుందని తెలిపారు.

అంతరిక్షంలో భారతదేశానికి చెందిన రూ. 50,000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయిని.. 50కి పైగా శాటిలైట్స్ పని చేస్తున్నాయని, వీటిని రక్షించాల్సిన అవసరం ఇస్రోపై ఉందని సోమ్ నాథ్ చెప్పారు.  సౌర తుఫానులపై ఆదిత్య ఎల్-1 నిఘా ఉంచి, అంతరిక్ష రక్షకుడిగా మారనుందని ఆయన అన్నారు. సాధారణంగా సౌర తుఫానుల నుంచి వచ్చే ఛార్జ్డ్ పార్టికల్స్, ప్రమాదకరమైన తరంగాలు. ఇవి అంతరిక్షంలోని శాటిలైట్స్, భూమిపై ఉన్న పవర్ గ్రిడ్స్‌పై వాటి ప్రభావం చూపిస్తాయి. వీటిని ఆదిత్య-ఎల్1  ముందుగానే గుర్తించడంతో.. శాటిలైట్లను రక్షించుకోవచ్చు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =