తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల మధ్య మాటల వ్యవహారం కొనసాగుతోంది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనను అవమానించారంటూ ఆయనపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రేవంత్ రెడ్డిపై కొన్ని పరుష వ్యాఖ్యలు కూడా చేశారంటూ మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు. వెంకట్ రెడ్డిపై సైతాను చేసిన తన వ్యాఖ్యలపై ఆయన వివరం ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి ఎక్కడా మాట్లాడలేదని, దీనిపై ఎలాంటి అనుమానం అక్కరలేదని, అనవసరంగా మా వెంకన్న (వెంకట్ రెడ్డి) మనస్తాపం చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఆయనకు, తనకూ మధ్య గొడవలు సృష్టించాలని మధ్యలో కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇక ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశాడని, రాజగోపాల్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY






































