ఆగస్టు 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి?

Komatireddy Rajagopal Reddy Likely to Join in BJP on August 21 in the Presence of Amit Shah, Rajagopal Reddy Likely to Join in BJP on August 21 in the Presence of Amit Shah, Komatireddy Rajagopal Reddy Likely to Join in BJP in the Presence of Amit Shah, Telangana MLA Komatireddy Rajagopal Reddy to join BJP on Aug 21, Komatireddy Rajagopal Reddy Likely to Join in BJP on August 21, Munugode MLA Komatireddy Rajagopal Reddy to join BJP on Aug 21, MLA Komatireddy Rajagopal Reddy to join BJP on Aug 21, Rajagopal Reddy Likely to Join in BJP, Union Home Minister Amit Shah, Munugode MLA Komatireddy Rajagopal Reddy, MLA Komatireddy Rajagopal Reddy, Komatireddy Rajagopal Reddy, Munugode MLA, Komatireddy Rajagopal Reddy News, Komatireddy Rajagopal Reddy Latest News, Komatireddy Rajagopal Reddy Latest Updates, Komatireddy Rajagopal Reddy Live Updates, Mango News, Mango News Telugu,

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన భవిష్యత్ కార్యచరణపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టి సారించారు. అందులో భాగంగా శుక్రవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను రాజగోపాల్ రెడ్డి కలిసారు. ఈ భేటీ సందర్భంగా పార్టీలో చేరిక సహా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. అమిత్ షాతో భేటీ అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఆగస్టు 21వ తేదీన అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామా లెటర్ తయారుచేసి పెట్టుకున్నానని, ఈనెల 8న లేదా స్పీకర్ అపాయింట్ మెంట్ దొరికిన వెంటనే రాజీనామాను ఆమోదించుకుంటానని తెలిపారు.

మునుగోడు తీర్పు తెలంగాణ రాజకీయాల్లో మార్పు తీసుకురాబోతుదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అమిత్ షాతో బీజేపీలో చేరే తేదీ గురించి మాట్లాడానని, 21వ తేదీన తెలంగాణకు వచ్చేందుకు అమిత్ షా అంగీకరించారని చెప్పారు. మరికొందరు వ్యక్తులు కూడా చేరుతున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి తప్పకుండా వస్తానని అమిత్ షా చెప్పారన్నారు. తెలంగాణలో మలి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని, కలిసి రావాలని పలువురు బీజేపీ నేతలు తనను పార్టీలోకి ఆహ్వానించినట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =