తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్.. ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి దాసోజు శ్ర‌వ‌ణ్ రాజీనామా

Telangana AICC Spokesperson Dasoju Sravan Resigns From Congress Party, AICC Spokesperson Dasoju Sravan Resigns From Congress Party, Telangana AICC Spokesperson Resigns From Congress Party, Dasoju Sravan Resigns From Congress Party, a major setback to Congress party in Telangana, Telangana All India Congress Committee spokesperson Dasoju Sravan Resigns From Congress Party, Congress AICC spokesperson calls for resignation, Dasoju Sravan Resigns, Telangana All India Congress Committee, Telangana All India Congress Committee spokesperson Dasoju Sravan, Telangana AICC Spokesperson Dasoju Sravan, Telangana AICC Spokesperson, Dasoju Sravan, Dasoju Sravan Resigns News, Dasoju Sravan Resigns Latest News, Dasoju Sravan Resigns Latest Updates, Dasoju Sravan Resigns Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇటీవలే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డితో మొదలైన రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి దాసోజు శ్ర‌వ‌ణ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు స‌రైన న్యాయం జ‌ర‌గ‌ట్లేద‌ని, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నియంతృత్వ పోకడకల వలన ద్వితీయ శ్రేణి నాయకులు ఎదగలేకపోతున్నారని ఆవేదన చెందారు. రేవంత్ రెడ్డి పార్టీలోని ఇతర నేతలను కలుపుకుని పోవడంలో విఫలమయ్యారని, ఆయన ఆధ్వర్యంలో పార్టీ తెలంగాణలో ఎప్పటికీ అధికారంలోకి రాలేదని శ్ర‌వ‌ణ్ అన్నారు.

తెలంగాణ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ కూడా రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలను చూసీచూడనట్లు పోతున్నారని, దీని వలన పార్టీ దెబ్బ తింటోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనకు మంచి అవకాశాలిచ్చిందని, దీనికి తాను కృతజ్ఞత తెలుపుకుంటున్ననై చెప్పిన శ్రవణ్, అయితే పార్టీ అధినాయకత్వం రాష్ట్ర నాయకత్వంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కాగా శ్రవణ్ ఖైరతాబాద్ నియోజకవర్గం సీటు ఆశించారని, అయితే ఆయనను సంప్ర‌దించ‌కుండానే రేవంత్ రెడ్డి ఏక‌ప‌క్షంగా పీజేఆర్ కుమార్తె విజ‌యారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవ‌డం శ్ర‌వ‌ణ్‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేసిన‌ట్లు స‌మాచారం. ఇక గత ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 17 =