సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి

CM KCR, Congress, Congress Latest News, Kodangal, Mango News, Revanth Reddy, Revanth Reddy Sensational Comments On CM KCR, Telangana Latest News, Telangana News, telugu breaking news, telugu latest news, TPCC President Revanth Reddy, TPCC President Revanth Reddy Sensational Comments On CM KCR, TPCC President Revanth Reddy Sensational Comments on CM KCR Over His Politics

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవ్వాలని ప్రయత్నం చేస్తున్నారని ఇది జరగని పని అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు రేవంత్‌ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ లీడర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో సమావేశయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చిన రేవంత్‌రెడ్డికి స్వాగతం పలికారు వెంకట్‌రెడ్డి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో కలిసి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజాకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిపారు.

మళ్ళీ కేంద్రంలో నరేంద్ర మోదీని అధికారంలోకి తీసుకురావటానికి సీఎం కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉంటున్న ముఖ్యమంత్రులను కూడగడుతున్నారని.. ఇది ఖచ్చితంగా ప్రధాని మోదీ కోరిక మేరకే జరుగుతోందని రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్‌ పాలనలోని లోపాలను ఎత్తిచూపటం ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత అని వారు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ నాయకులు 3 రోజులు వేడుకలు నిర్వహంచటానికి సిద్ధమవుతున్నారని.. కానీ, ఆ సమయంలో ఉద్యోగ నోటిఫికేషన్‌కు కేటీఆర్‌ చొరవ చూపాలని సూచించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు అనేక కష్టాలు పాలవుతున్నారని.. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ