ఫిబ్రవరి 25 నుంచి నుమాయిష్‌ ఎగ్జిబిషన్ పునఃప్రారంభం

2022 Numaish, Exhibition, Exhibition Society, Exhibition Society Set to Start Numaish, Exhibition Society Set to Start Numaish in Hyderabad, Mango News, MangoNews, Nampally 2022 Exhibition, Nampally Exhibition, Nampally Numaish, Nampally Numaish Exhibition to Resume, Nampally Numaish Exhibition to Resume From February 25th, Numaish, Numaish 2022, Numaish News, Numaish updates, Numaish-2020 Exhibition, Numaish-2022 Exhibition In Hyderabad

హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నిర్వహించే నుమాయిష్‌ కు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా జనవరి 1 తేదీన 81వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన (నుమాయిష్‌ ఎగ్జిబిషన్) ప్రారంభమైంది. అయితే ఒమిక్రాన్ కరోనా వేరియంట్ వ్యాప్తి, కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ ఆదేశాలకు అనుగుణంగా ప్రారంభమైన రెండో రోజునే జనవరి 2వ తేదీన నుమాయిష్‌ ఎగ్జిబిషన్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, అన్ని కార్యకలాపాలు పునరుద్ధరణ కావడంతో నుమాయిష్‌ ఎగ్జిబిషన్ ను ఫిబ్రవరి 25, శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభించనున్నట్టు ఎగ్జిబిషన్ సొసైటీ పేర్కొంది.

ఫిబ్రవరి 25వ తేదీ నుంచి నుమాయిష్‌ ఎగ్జిబిషన్ ప్రారంభించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నుంచి అనుమతులు లభించాయని, ఎగ్జిబిషన్ తిరిగి ప్రారంభం కానుండడం సంతోషంగా ఉందని సౌసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 25 నుంచి రోజూ (సాధారణ రోజులు) సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని, ఇక వారాంతంలో (శని, ఆది వారాల్లో) సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఎగ్జిబిషన్ నడవనుందని తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =