తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ముందు నుంచి కూడా దూకుడుగా వెళ్తున్న కాంగ్రెస్ సర్కార్.. మంగళవారం ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది. ఒకేసారి మూడు పోలీస్ కమీషనరేట్లలో బదిలీలు చేపట్టింది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సీపీలను మార్చేసింది. వారి స్థానంలో కొత్త వారిని ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని.. రాచకొండ సీపీగా సుధీర్ బాబును.. సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతిని ప్రభుత్వం బదిలీ చేసింది.
ప్రస్తుతం కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ఆర్గనైజేషన్స్ అండ్ లీగల్ విభాగానికి అడిషనల్ డీజీపీగా వ్యవహరిస్తున్నారు. ఆయన్ను ప్రభుత్వం బదిలీ చేయడంతో.. త్వరలో శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే రాచకొండ సీపీగా బదిలీ అయిన సుధీర్ బాబు.. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ సీపీగా పని చేస్తున్నారు. అటు అవినాష్ మొహంతీ ప్రస్తుతం సైబరాబాద్ జాయింట్ సీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. త్వరలో ఆయన సైబరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
వీరితోపాటు అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్ సీపీగా పని చేసిన సందీప్ శాండిల్యను ప్రభుత్వం.. యాంటీ నార్కోటిక్స్ వింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే వీరందరిని బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న డ్రగ్స్ వాడకంపై ఉక్కుపాదం మోపడం కోసం ప్రభుత్వం బదిలీలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE