బీజేపీ సంచలన నిర్ణయం.. తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన నేతకు సీఎం పదవి

Sensational decision of BJP CM post for the leader who won as MLA for the first time,Sensational decision of BJP,BJP CM post for the leader,Who won as MLA for the first time,Mango News,Mango News Telugu,Rajasthan, CM bhajanlal sharma, BJP, Rajasthan assembly elections,BJP CM post for the leader Latest News,BJP CM post Live Updates,BJP CM post Latest News,Rajasthan assembly elections Latest News,Rajasthan assembly elections Latest Updates
Rajasthan, Cm bhajanlal sharma, BJP, Rajasthan assembly elections

రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. మొత్తం 199 స్థానాలకు ఎన్నిక జరగగా.. అందులో 115 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈక్రమంలో రాజస్థాన్‌కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై రెండు వారాలుగా ఉత్కంఠ కొనసాగుతోంది. చివరికి ఈ ఉత్కంఠకు తెర దించుతూ బీజేపీ హైకమాండ్ రాజస్థాన్‌ ముఖ్యమంత్రిని ఖరారు చేసింది. రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ పేరును అధిష్టానం ఫైనల్ చేసింది.

మంగళవారం జైపూర్‌లో బీజేపీ శాసనభాపక్ష సమావేశం జరిగింది. బీజేపీ కేంద్ర పరిశీలకులు రాజ్‌నాథ్ సింగ్, సంజయ్ పాండే, వినోద్ తవ్డే, సీపీ జోషి, ప్రహ్లోద్ జోషిలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి పదవి కోసం మాజీ సీఎం వసుంధర రాజే సింధియా, అర్జున్ రామ్ మేఘ్వాలే, జైపూర్ యువరాణి దియా కుమారిలు పోటీ పడగా.. వారందరినీ అధిష్టానం పక్కన పెట్టేసింది. బీజేపీఎల్పీ సమావేశంలో భజన్‌లాల్ శర్మను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అయితే అనూహ్యంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన భజన్‌లాల్ శర్మను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఇకపోతే బీజేపీ ఎల్పీ సమావేశంలో రాజస్థాన్‌కు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను కూడా ఖరారు చేశారు. దియా సింగ్ కుమారి, ప్రేమ్ చంద్ బైర్వాలకు ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు.

ఆర్ఎస్ఎస్ నేపథ్యంవున్న భజన్‌లాల్ శర్మ నాలుగు సార్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. మొదట భజన్‌లాల్ భరత్‌పూర్ టికెట్ ఆశించారు. కానీ అధిష్టానం పలు  కారణాల చేత ఆ టికెట్‌కు బదులుగా.. సంగనేర్ టికెట్ కట్టబెట్టింది. దీంతో ఆ స్థానం నుంచి పోటీ చేసిన భజన్‌లాల్ శర్మ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంధ్ర జీ భరద్వాజ్‌పై 48 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + twelve =