తెలంగాణలో ముగిసిన పోలింగ్

Polling is over in Telangana,Polling is over,Polling in Telangana, telangana polling , elections , brs , congress , bjp , results , telangana elections,Mango News,Mango News Telugu,Assembly Elections 2023 highlights,Telangana Politics,Telangana Assembly polls,Telangana Elections 2023,Telangana Elections Latest News,Telangana Elections Latest Updates,Telangana Polling Latest News
telangana polling , elections , brs , congress , bjp , results , telangana elections

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 119 స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారిని ఓటు వేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. 13 సమస్యాత్మక ప్రాంతంలో అధికారులు సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగించారు. ఉదయం మందకొడిగా ప్రారంభమై పోలింగ్.. ఆ తర్వాత వేగం పుంజుకుంది. పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యువతీయువకులు, కొత్తగా ఓటు హక్కును వినియోగించుకునే వారు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. అటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు ముందుగానే గుర్తించారు. ఆయా ప్రాంతంలో గంట ముందుగానే పోలింగ్ ముగిసేలా ఏర్పాట్లు చేశారు. చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్, అసిఫాబాద్, భూపాలపల్లి, మంథని, ఇల్లెందు, ములుగు, పినపాక, భద్రాచలం, అశ్వారావు పేట స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో మిగిలిన 106 స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.

ఈసారి పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలిరావడంతో.. పోలింగ్ శాతాలు భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. అటు ఎప్పటికీ పోలింగ్ తక్కువ శాతం నమోదయ్యే హైదరాబాద్‌లో కూడా ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 6 =