ప్రముఖ సినీనటుడు జయప్రకాశ్‌రెడ్డి కన్నుమూత

Actor Jayaprakash Reddy, Actor Jayaprakash Reddy Dies, Actor Jayaprakash Reddy Dies of Heart Attack, Jayaprakash Reddy Death, Jayaprakash Reddy Dies, Jayaprakash Reddy Dies of Heart Attack, Telugu Actor Jaya Prakash Reddy Passes Away, Telugu actor Jayaprakash Reddy dies of heart attack, Telugu senior actor Jayaprakash Reddy, Tollywood News

ప్రముఖ సినీనటుడు జయప్రకాశ్‌రెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన బాత్‌రూమ్‌లో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. లాక్‌డౌన్‌ ప్రారంభమయినప్పటి నుంచి షూటింగ్స్ లేకపోవడంతో ఆయన గుంటూరులోని విద్యానగర్‌లోనే ఉంటున్నారు. జయప్రకాశ్‌రెడ్డి మే 8, 1946 న జన్మించారు. ఆయన స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని సిరివెళ్ల గ్రామం. రంగస్థలం మీద ఎన్నో నాటికలు వేసి, నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. బ్రహ్మపుత్రుడు చిత్రం ద్వారా ముందుగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. అనంతరం తెలుగు, కన్నడ, తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించారు.

రాయలసీమ యాసతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాత్ర ఏదైనా సరే ప్రాణం పోసి ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నాయక్‌, కృష్ణ, నరసింహనాయుడు, జయం మనదేరా, కబడ్డీ కబడ్డీ, చెన్నకేశవరెడ్డి, సీతయ్య, సరిలేరు నీకెవ్వరు ఇలా ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. సినీనటుడిగా బిజీగా ఉన్నప్పటికీ నాటకరంగం మీద అమితమైన ప్రేమతో నాటకాల ప్రదర్శనలు ఎక్కడా జరుగుతున్నా జయప్రకాశ్‌రెడ్డి పాల్గొనే వారు. గుంటూరులోనే జయప్రకాశ్‌రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. జయప్రకాశ్‌రెడ్డి లాంటి నటుడిని కోల్పోవడంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. జయప్రకాశ్‌రెడ్డి మృతి పట్ల సినీ ప్రముఖులు, తోటి నటీనటులు, అభిమానులు సంతాపం తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =