తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ అభ్యర్థిగా పార్టీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో రాజ్యసభ సభ్యుడిగా గాయత్రి రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సోమవారం గాయత్రి రవికి ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ముందుగా మే 20న నామినేషన్ల పరిశీలన అనంతరం ఈ స్థానానికి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి జాజుల భాస్కర్, ఇండిపెండెంట్ అభ్యర్థి భోజ్రాజ్ కొయాల్కర్ దాఖలు చేసిన నామినేషనన్స్ సరిగ్గా లేని కారణంగా తిరస్కరించినట్టు చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ప్రకటించారు. ఇక ఈ ఉపఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో (మే 23, సోమవారం) ముగియడంతో, పోటీలో ఎవరూ లేకపోవడంతో గాయత్రి రవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు.
ముందుగా రాష్ట్రంలో గత నవంబర్ లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న బండ ప్రకాష్ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో ఏప్రిల్ 2, 2024 వరకు ఉన్న తన రాజ్యసభ సభ్యత్వానికి బండ ప్రకాష్ రాజీనామా చేయడంతో, ఈ స్థానంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఉపఎన్నిక ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది. బండ ప్రకాష్ స్థానంలో ఈ స్థానానికి గాయత్రి రవి పేరును టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ క్రమంలోనే గాయత్రి రవి రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF