కొండాపూర్ ఏరియా ఆస్ప‌త్రిలో మంత్రి హ‌రీష్ రావు ఆక‌స్మిక త‌నిఖీ, లంచం డిమాండ్ చేసిన డాక్ట‌ర్‌పై సస్పెన్షన్ వేటు

Minister Harish Rao Sudden Inspection at Kondapur Area Hospital and Suspends Doctor For Bribery Charges, Harish Rao Sudden Inspection at Kondapur Area Hospital and Suspends Doctor For Bribery Charges, Telangana Minister Harish Rao Sudden Inspection at Kondapur Area Hospital and Suspends Doctor For Bribery Charges, Telangana Minister Sudden Inspection at Kondapur Area Hospital and Suspends Doctor For Bribery Charges, Kondapur Area Hospital, Minister Harish Rao Suspends Doctor For Bribery Charges, Bribery Charges, Minister Harish Rao, Finance Minister Harish Rao, Telangana Finance Minister Harish Rao, Harish Rao Telangana Finance Minister, Telangana Finance Minister Suspends Doctor For Bribery Charges, Bribery Charges, Kondapur Area Hospital Bribery Charges, Kondapur Area Hospital Bribery Charges News, Kondapur Area Hospital Bribery Charges Latest News, Kondapur Area Hospital Bribery Charges Latest Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు హైద‌రాబాద్‌లోని కొండాపూర్ ఏరియా ఆస్ప‌త్రిలో సోమవారం ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆస్ప‌త్రిలో రోగుల‌కు అందుతున్న వైద్య‌ సేవ‌ల‌పై ఆరా తీశారు. అలాగే లంచం ఆరోపణల కేసులో ఒక డాక్ట‌ర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. గైన‌కాల‌జీ వార్డును పరిశీలించిన మంత్రి వార్డుల్లో నిత్యం స్కానింగ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని, దీనికోసం అద‌నంగా మ‌రో రెండు అల్ట్రా సౌండ్ యంత్రాలు పంపుతామ‌ని హామీ ఇచ్చారు. గైనకాలజి వార్డులో సదుపాయాలను పరిశీలించిన హ‌రీష్ రావు.. ఆస్పత్రిలో సాధార‌ణ డెలివ‌రీలు 60 శాతానికి పైగా నమోదు కావ‌డం ప‌ట్ల హ‌రీష్ రావు సంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ సందర్భంగా వైద్యులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఈ సమయంలో ఆస్ప‌త్రిలో కొంత మంది వ్య‌క్తులు డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్ కోసం స్థానిక డాక్ట‌ర్ మూర్తి డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నార‌ని మంత్రికి ఫిర్యాదు చేశారు. వివరాలు అడిగి తెల్సుకున్న మంత్రి దీనిపై సత్వర విచార‌ణ చేప‌ట్టి మంత్రి డాక్ట‌ర్ మూర్తిని అక్కడికక్కడే స‌స్పెండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం అయితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామని ఆయన హెచ్చ‌రించారు. ఈ క్రమంలో మంత్రి ఆసుపత్రిలోని అన్ని గదులలో కలియ తిరుగుతూ వైద్య సేవలు ఎలా అందుతున్నాయని, సదుపాయాలు ఎలా ఉన్నాయి అంటూ పేషెంట్లను ఆరా తీశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 2 =