తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించి 12 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (సీఈవో) శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీ దీక్షా దివస్ రోజైన నవంబర్ 29 తేదీన ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన విజయగర్జన సభ వాయిదా పడింది.
హన్మకొండ జిల్లాలోని హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో నవంబర్ 29న విజయగర్జన బహిరంగ సభ కోసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తుండగా, తాజాగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాయిదా పడింది. మరోవైపు నవంబర్ 10, బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. రెండు జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల మంజూరు నేపథ్యంలో సీఎం పర్యటన జరగాల్సి ఉండగా, ఎన్నికల కోడ్ వలన ఈ పర్యటన కూడా వాయిదా పడినట్లు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ