తెలంగాణలో గ్రూప్‌–2 ఫలితాలు విడుదల

Group 2 Results Released, Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Group 2 Results, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019, TSPSC Released Group-2 Results

గత రెండు సంవత్సరాలుగా అభ్యర్థులు ఎదురు చూస్తున్న గ్రూప్‌–2 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. తెలంగాణలో గ్రూప్‌–2 తుది ఫలితాలను అక్టోబర్ 24,శుక్రవారం నాడు టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. గతంలో గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1,032 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా, అందులో 1,027 పోస్టులను భర్తీ చేస్తూ టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఎంపిక చేసిన అభ్యర్థుల్లో 259 మందిని డిప్యూటీ తహశీల్దారులుగా, 284 మందిని ఎక్సైజ్ ఎస్సైలుగా, 156 మందిని వాణిజ్య పన్నుల అధికారులుగా నియమించబోతున్నారు. మిగతావారిని మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులుగా నియమిస్తామని, మిగిలిన 5 పోస్టులకు అభ్యర్థులు దొరకకపోవడంతో వాటిని భర్తీ చేయలేదని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి వెల్లడించారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను www.tspsc.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

[subscribe]