50 శాతం బెడ్స్ ప్రభుత్వ ఆధీనంలోకి ఇచ్చేందుకు ప్రైవేట్ ఆసుపత్రులు అంగీకారం

50% beds in Private Hospitals for Covid-19 Treatment, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus In Telangana, Coronavirus Latest News, COVID-19, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus News, Telangana Govt, Telangana Govt Decides to take over 50% beds in Private Hospitals

ప్రైవేట్ కార్పోరేట్ ఆసుపత్రుల యాజమాన్యాల ప్రతినిధులతో ఆగస్టు 13, గురువారం నాడు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ భేటీ అయ్యారు. కరోనాకు వైద్యం అందించేందుకు ప్రభుత్వంతో కలిసి రావాలని కోరే నేపథ్యంలో కార్పోరేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 50% శాతం పడకలు ప్రభుత్వానికి ఇవ్వాల్సేందేనని స్పష్టం చేయటంతో, 50% శాతం పడకలను ప్రభుత్వానికి అప్పగించేందుకు ప్రైవేట్ యాజమాన్యాల ప్రతినిధులు అంగీకరించారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వ నిర్ణయానికి ఒప్పుకోవడంతో కార్పోరేట్ ఆస్పత్రుల ప్రతినిధులకు మంత్రి ఈటల ధన్యవాధాలు తెలపారు. ప్రభుత్వానికి అప్పగించిన పడకల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు జారీ చేసిన జీవో 248 ప్రకారం కరోనా ట్రీట్మెంట్ జరగనుంది. సాధారణ వార్డులో ట్రీట్మెంట్ కు 4 వేలు, ఐసీయూ లో 7500, వెంటిలేటర్ మీద పెడితే 9 వేలు మాత్రమే ఛార్జ్ జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం శుక్రవారం రోజు వైద్యశాఖ అధికారులు విధివిధానాలను తయారు చేయనున్నారు..

ముందుగా కరోనా చికిత్స నేపథ్యంలో ప్రైవేట్ కార్పోరేట్ ఆస్పత్రులు సైతం కరోనా కు చికిత్స అందించేందుకు మానవతా దృక్పధంతో ముందుకు రావాలని, పలుమార్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, అధికారులు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు సంక్షోభ సమయంలో కరోనా చికిత్సను వ్యాపార కోణంలో చూడవద్దని విన్నవించారు. కరోనా చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులలో సాధారణ వార్డులో ట్రీట్మెంట్ కు 4 వేలు, ఐసీయూ లో 7500, వెంటిలేటర్ మీద పెడితే 9 వేలు రోజుకు చార్జి చేయాలని నిబంధనలు కూడా వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసింది. కానీ చాలా ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోవటంతో తెలంగాణ ప్రభుత్వం కార్పోరేట్, ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలకు సిద్ధమైంది. పేషెంట్ల నుంచి లక్షల రూపాలయు వసూలు చేయటం, చనిపోయిన బాడీలను సైతం డబ్బులు కడితేనే ఇస్తామని వేధించటం అడ్వాన్స్ చెల్లించుకుండా పేషెంట్ను చేర్చుకోకపోవటం, రోజుకు లక్ష నుంచి రెండు లక్షలు వసూలు చేయటం, ఇన్సూరెన్స్ అనుమతించక పోవటం, డబ్బులు కట్టినా భిల్లులు ఇవ్వడం లేదంటూ పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ప్రజల భయాంధోళనలను సొమ్ము చేసుకోవటంపై ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ జేసింది. లిఖిత పూర్వక పిర్యాధులు అందంటంతో రెండు ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ అనుమతిని కూడా రద్దు చేసింది. మిగిలిన ఆస్పత్రులకు షోకాజు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం పదే పదే హెచ్చరించినా, ప్రైవేట్ ఆసుపత్రులు తీరు మార్చుకోక పోవటంతో, అపిడమిక్ డిసీజ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్స్ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించి, ఆ దిశగా చర్యలు చేపట్టారు.

మరోవైపు కరోనా కేసులు మొదలైనప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వైరస్ నియంత్రణ, కరోనా చికిత్సలో పకడ్బంధీ చర్యలతో ముందుకు పోతుంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి తగ్గట్లుగా పరీక్షలు సంఖ్యను కూడా తెలంగాణ ప్రభుత్వంపెంచింది. ఎంతమంది పేషెంట్లు వచ్చినా, చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటుగా, రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని ఉచితంగా కరోనా చికిత్స అందిస్తుంది. మరోవైపు కరోనా వచ్చిన వాళ్ళ ప్రాణాలను కాపాడేందుకు ఆక్సిజన్ పడకలను సిద్దం చేసింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆక్సిజన్ బెడ్లను కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్దం చేసింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + one =