తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందింది. రాష్ట్రంలో ఇప్పటీకే గ్రూప్-1, గ్రూప్-4 నోటిఫికేషన్స్ విడుదల కాగా తాజాగా గ్రూప్-2 నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. గ్రూప్-2 కింద 783 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–3, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, నాయిబ్ తహసీల్దార్ సహా పలు విభాగాలకు చెందిన పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులంతా కమిషన్ వెబ్‌సైట్ లో https://.tspsc.gov.in/ లో ఉంచే నిర్ణిత ప్రొఫార్మాలో జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. అలాగే గ్రూప్-2 పరీక్ష విధానంలో నాలుగు పేపర్స్ ఉండనున్నాయి. పూర్తి వివరణాత్మక నోటిఫికేషన్ ను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచారు.
గ్రూప్-2 నోటిఫికేషన్ కింద భర్తీ చేసే పోస్టుల వివరాలు (783):
- మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–3 – 11 పోస్టులు
- అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ – 59
- నాయిబ్ తహసీల్దార్ – 98
- సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–2 – 14
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ – 63
- అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ – 09
- మండల పంచాయతీ అధికారి (ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్) – 126
- ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్ – 97
- అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ – 38
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్) – 165
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లెజిస్లేటివ్ సెక్రటేరియట్) – 15
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్ డిపార్ట్మెంట్) – 25
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా డిపార్ట్మెంట్) – 07
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ( తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్) – 02
- డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్ గ్రేడ్-2 – 11
- అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ – 17
- అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ – 09
- అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ – 17.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE