మద్యం ప్రియులకు శుభవార్త, రాత్రి 9:30 వరకు ఓపెన్

telangana, Telangana Liquor Shops, Telangana Liquor Shops Open, Telangana Liquor Stores, Telangana Lockdown, telangana wine shops, wine shops, Wine Shops in Telangana, Wine Shops in Telangana will Remain Open up to 9.30 PM, Wine Shops will Open up to 9.30 PM

తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. వైన్స్ షాపులను రాత్రి 9.30 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్టు రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. జూలై 2, గురువారం నుంచి వైన్స్ షాపులు తెరిచివుంచే సమయాల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు ప్రకారం వైన్స్ షాపుల సమయాన్ని పెంచినట్టు మంత్రి తెలిపారు.

మరోవైపు గుడుంబా తయారీ, అమ్మకందారులపై కఠీన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇతర రాష్ట్రాల నుండి నల్ల బెల్లం రవాణా, అక్రమమద్యం సరఫరా, గుడుంబా తయారీకి సంబంధించి సమాచారం తెలిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచి తగిన పారితోషకం అందిస్తామని తెలిపారు. గుడుంబా తయారు, అమ్మకందారులపై పిడి యాక్టు క్రింద కేసులను నమోదు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులకు ఆదేశాలిచ్చారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu