ఏపీలో రేపటి నుంచే ఏడో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం

Andhra Pradesh, AP CM YS Jagan, AP Free Ration Distribution, AP News, Free Ration Distribution, Free Ration Distribution In AP, Ration Distribution In AP, Seventh Phase Free Ration, Seventh Phase Free Ration Distribution, Seventh Phase Free Ration Distribution in AP

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తిస్థాయి లాక్‌డౌన్ ముగిసాక కూడా పేదలు ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో ఉచితంగా రేషన్ పంపిణీని ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే ఆరు విడతల్లో ఉచిత రేషన్ అందించగా, జూలై 3, గురువారం నుంచి ఏపీలో ఏడో విడత ఉచిత రేషన్‌ పంపిణీ ప్రారంభం కానుంది.

రేషన్ కార్డులో నమోదైన ఒక్కో మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కుటుంబానికి కేజీ కందిపప్పు అందించనున్నారు. అయితే పంచదారకు మాత్రం లబ్ధిదారులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ  ఉచిత రేషన్ పంపిణీ ద్వారా రాష్ట్రంలో మొత్తం 1,48,05,879 కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది. మరోవైపు ఉచిత రేషన్ కు సంబంధించి రాష్ట్రానికి అదనంగా బియ్యం కేటాయించాలని, పౌర సరఫరాల శాఖ అధికారులు కేంద్రానికి బుధవారం నాడు లేఖ రాసినట్టు తెలుస్తుంది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here