అడ్ హక్ అధికార ప్రతినిధులను నియమించిన వైఎస్ షర్మిల

Mango News, Sharmila Telangana party, Sharmila to float a new political party, YS Sharmila, YS Sharmila Appointed Official Spokespersons, YS Sharmila Appointed Official Spokespersons for the Party, YS Sharmila Latest News, YS Sharmila News, YS Sharmila Party In Telangana, YS Sharmila Party News, YS Sharmila’s YSR Telangana Party, YSR Telangana party, YSR Telangana party Spokespersons

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ జయంతి అయిన జులై 8వ తేదీన కొత్త పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించనున్నట్టు ఏప్రిల్ 9న ఖమ్మంలో జరిగిన బహిరంగసభలో తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ నిర్మాణ పక్రియపై ఆమె మరింత దృష్టి సారించారు. వైఎస్ షర్మిల ఆదేశానుసారం అడ్ హక్ అధికార ప్రతినిధులను నియమించడం జరిగిందని ఆమె కార్యాలయం శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. కొండా రాఘవరెడ్డి, తూడి దేవేందర్ రెడ్డి, ఇందిరా శోభన్, పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, సయ్యద్ ముజ్టాబ్ అహ్మద్, మతిన్ ముజాదద్ది, భూమి రెడ్డి, బీశ్వ రవీందర్ లను అడ్ హక్ అధికార ప్రతినిధులుగా నియమించినట్టు తెలిపారు. మరోవైపు వైఎస్ షర్మిల పార్టీ పేరును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్ టీపీ) గా ఖరారు చేసినట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ