ప్రకృతితో మమేకమై జీవించడం నేటి పరిస్థితుల్లో మరింత ఆవశ్యకం : వెంకయ్య నాయుడు

2021 World Environment Day, Mango News, Venkaiah Naidu, Venkaiah Naidu Conveyed Wishes to People on World Environment Day, Vice President Venkaiah Naidu, Vice President Venkaiah Naidu Conveyed Wishes to People, Vice President Venkaiah Naidu Conveyed Wishes to People on World Environment Day, Vice President Venkaiah Naidu conveys greetings, World Environment Day, World Environment Day 2021, World Environment Day News, World Environment Day Updates

అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతితో మమేకమై జీవించడం నేటి పరిస్థితుల్లో మరింత ఆవశ్యకమని, అందుకోసం పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “సుస్థిర వ్యవసాయ విధానాలను అమలుపరుస్తూ, అటవీకరణను ప్రోత్సహించడంతో పాటు సముద్ర కాలుష్యాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. పర్యావరణానుకూల జీవన విధానాలను పాటిస్తూ, కర్బన ఉద్గారాలను వీలైనంత మేర తగ్గించుకోవడంపైనా మనమంతా దృష్టిపెట్టాల్సిన అవసరముంది. ఈ సందర్భంగా భవిష్యత్ తరాలకు జీవనానుకూల వాతావరణాన్ని అందించేందుకు మనమంతా కంకణబద్ధులమవుదాం” అని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =