తెలంగాణలో రేష‌న్‌ కార్డుదారుల‌కు 15 కిలోల ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం

15 Kg Free Rice Distribution, 15 Kg Free Rice Distribution In Telangana, 15 Kg Free Rice Distribution Started, 15 Kg Free Rice Distribution Started from Today, 15 Kg Free Rice Distribution Started from Today to Ration Card Holders, 15 Kg Free Rice Distribution Started from Today to Ration Card Holders in Telangana State, 15 Kg Free Rice Distribution Started In Telangana, 15 kg of free rice for the poor in Telangana, Covid-19 Relief, Free ration for cardholders, Free rice supply in June and July, Mango News, telangana, telangana government

తెలంగాణ రాష్ట్రంలో రేష‌న్‌ కార్డుదారుల‌కు జూన్ 5, శనివారం నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభమైంది. ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌రకు రేష‌న్ షాపులు తెరచిఉంచనుండగా, జూన్ 20వ తేదీవరకు ఉచిత బియ్యం పంపిణీ కొనసాగనుంది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలను అనుసరించి జూన్ నెలకు గానూ రేషన్ కార్డులో ఉన్న ఒక్కొక్కరికి 15 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.

మాములుగా రాష్ట్రంలో ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ జరుగుతుండగా ఈనెలలో 15 కిలోలు అందిస్తున్నారు. ముందుగా కరోనా పరిస్థితులు, రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలులో ఉండడంతో ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద మే, జూన్‌ నెలల్లో ఒక్కొక్కరికి 5 కిలోలు చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మే, జూన్ నెల కోటా 10 కిలోలు, రాష్ట్ర ప్ర‌భుత్వం తరపున 5 కిలోల కలిపి మొత్తం 15 కిలోలు చొప్పున ఉచిత బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయనున్నారు. మరోవైపు రేషన్ షాపుల వద్ద భౌతిక దూరం పాటించడంతో పాటుగా శానిటైజర్లు, మంచినీరు సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − seven =