దివంగత ముఖ‍్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆయన కుమార్తె, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భావోద్వేగ ట్వీట్ చేశారు. “ఒంటరి దానినైనా విజయం సాధించాలని, అవమానాలెదురైనా ఎదురీదాలని, కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని, ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది. I Love & Miss U DAD” అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. మరోవైపు గురువారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ పాటుగా వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఒంటరి దానినైనా విజయం సాధించాలని,
అవమానాలెదురైనా ఎదురీదాలని,
కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని,
ఎప్పుడూ ప్రేమనే పంచాలని,
నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి
నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు.
నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.
ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది.
I Love & Miss U DAD— YS Sharmila (@realyssharmila) September 2, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ