తెలంగాణ అభివృద్ధికి, ప్రభుత్వానికి ఉద్యోగులు మంచి పేరు తీసుకురావాలి : సీఎస్

Telangana Secretariat Association Felicitated CS Somesh Kumar

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజన్ ప్రకారం పని చేయాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరియు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉద్యోగులను కోరారు. 122 మంది సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినందుకు గురువారం నాడు బీఆర్కేఆర్ భవన్‌లో తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ సీఎస్ సోమేశ్ కుమార్‌ ను సన్మానించింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని పేద ప్రజలకు సహాయం చేయడానికి పారదర్శకంగా సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని ఉద్యోగులను కోరారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా పదోన్నతులు కల్పించామని మరియు ప్యానెల్ సంవత్సరంతో సంబంధం లేకుండా ప్రమోషన్లను ఇవ్వడానికి 3 సంవత్సరాల నుండి 2 సంవత్సరాలకు సర్వీస్ వ్యవధిని తగ్గిస్తూ ఒక జిఓ జారీ చేసిందని సీఎస్ తెలియజేశారు. అలాగే సీఎం కేసీఆర్ ఉద్యోగులకు 30% పిఆర్‌సి కూడా ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగులందరికీ డ్రాఫ్టింగ్, నోట్స్, కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణను ఏర్పాటు చేయడం ద్వారా మానవ వనరులను అభివృద్ధి చేయాలని జీఏడీకి ఆయన సూచించారు. తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేందర్ రావు, ప్రమోషన్లు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు మరియు సీఎస్ సోమేశ్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, ఉద్యోగులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 6 =