36 గంటల్లోగా సిలిండర్ డెలివరీ చేయాలి – గ్యాస్ కంపెనీలకు సీఎం చంద్రబాబు డెడ్ లైన్

AP CM Chandrababu Reviews on Gas Crisis, Directs Delivery Within 36 Hrs of Booking

దేశవ్యాప్తంగా వంటగ్యాస్ (LPG) కొరత నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు చర్యలను ప్రారంభించింది. దీనిలో భాగంగా తాజాగా గ్యాస్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఆర్టీజీఎస్ (RTGS) వేదికగా గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో ఆయన అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ల సరఫరాలో జాప్యం జరగకుండా చూడాలని, బుక్ చేసిన ఒకటిన్నర రోజుల్లోనే (36 గంటలు) వినియోగదారుడి ఇంటికి సిలిండర్ చేరాలని అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

బ్లాక్ మార్కెట్‌పై ఉక్కుపాదం: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాలో తలెత్తిన ఇబ్బందులను సాకుగా చూపి, సిలిండర్లను పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

  • డేటా ఆధారిత పర్యవేక్షణ: గ్యాస్ డెలివరీలో సాంకేతికతను ఉపయోగించాలని, ఓటీపీ (OTP) ద్వారానే పంపిణీ జరగాలని స్పష్టం చేశారు.

  • ముఖ్య సంస్థలకు మినహాయింపు: ఆస్పత్రులు, పాఠశాలలు, దేవాలయాలు మరియు అన్న క్యాంటీన్లకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకూడదని అధికారులను ఆదేశించారు.

  • నిల్వల వివరాలు: రాష్ట్రంలో ప్రస్తుతం 17,209 టన్నుల వంటగ్యాస్ నిల్వలు ఉన్నాయని, వినియోగదారుల్లో ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్: భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలు రాకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారాల వైపు అడుగులు వేయాలని చంద్రబాబు సూచించారు.

  • పైప్‌లైన్ గ్యాస్: ఒఎన్జీసీ (ONGC), గెయిల్ (GAIL) వంటి సంస్థలతో చర్చించి ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

  • ఇండక్షన్ స్టౌవ్స్: గ్యాస్ వినియోగాన్ని తగ్గించేలా ఇండక్షన్ స్టౌవ్‌లను ప్రోత్సహించాలని, హోటల్ అసోసియేషన్లతో చర్చలు జరపాలని సూచించారు.

మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన: చమురు సంక్షోభం కారణంగా కిరోసిన్ అవసరమైన చిరు వ్యాపారులకు సహాయం చేసే అంశాన్ని పరిశీలించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here