కడపజిల్లాలోని వెలిగల్లు రిజర్వాయర్ కు వైఎస్ఆర్ పేరు

Andhra Pradesh, Andhra Pradesh Latest News, Andhra Pradesh News, AP Govt, AP Govt has Changed Veligallu Project Name, Veligallu Project Name, Veligallu Project Name as YSR Veligallu Reservoir, Veligallu Reservoir, YSR Veligallu Reservoir

వైఎస్ఆర్ కడప జిల్లాలోని పాపాఘ్ని నదిపై నిర్మించిన వెలిగల్లు రిజర్వాయర్ కు “వైఎస్‌ఆర్‌ వెలిగల్లు రిజర్వాయర్‌” గా ప్రభుత్వం నామకరణం చేసింది. ఈ పేరు మార్పుకు సంబంధించి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జూన్ 26, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. 2006 లో జలయజ్ఞంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టి పూర్తీ చేశారు. దీంతో ఈ రిజర్వాయర్ కు వైఎస్ఆర్ పేరు పెట్టాలని ప్రభుత్వ చీఫ్ విఫ్ శ్రీకాంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

మరోవైపు రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రత్యేక వాహక సంస్థ (ఎస్పీవీ) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఏపీ‌ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఎస్పీవీ వందశాతం ప్రభుత్వ నిధులతో పనిచేస్తుందని వెల్లడించారు. జలవనరులశాఖ నుంచి ఎస్పీవీ ఏర్పాటుకు ముందుగా రూ.5 కోట్ల పెట్టుబడి నిధులును ప్రభుత్వం విడుదల చేసింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu