ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా

Amaravati House plots Distribution, AP Govt House Plots Distribution, AP Govt House Plots Distribution Program, AP House Plots Distribution Program Postponed, Corona Outbreak, House Plots Distribution, House Plots Distribution In AP, House Plots Distribution Program, House Plots Distribution Program Postponed

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8 వ తేదీన చేపట్టనున్నట్టు గతంలో రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను బట్టి ఈ కార్యక్రమాన్ని జూలై 8 న చేపట్టాలని భావించారు. అయితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తదుపరి తేదీని కూడా ప్రభుత్వం ఈ రోజే ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu