ఏపీలో సెప్టెంబర్ 5న ‘టీచర్స్ డే’ బహిష్కరణకు పిలుపునిచ్చిన ఉపాధ్యాయ సంఘాలు

APTF Calls For Boycott Teachers Day Celebrations on September 5th in AP, Boycott Teachers Day Celebrations, Teachers Day Celebrations on September 5th in AP, Boycott Teachers Day, Teachers Day Celebrations, Teachers Day 2022, 2022 Teachers Day, Andhra Pradesh Teachers Federation, APTF Calls For Boycott Teachers Day Celebrations, Boycott Teachers Day Celebrations News, Boycott Teachers Day Celebrations Latest News And Updates, Boycott Teachers Day Celebrations Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు శనివారం ఏపీ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) ప్రకటించింది. ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సన్మానాలు, సత్కారాలను తిరస్కరిస్తున్నట్లు ఫెడరేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను అవమానిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరేషన్‌లోని పలు ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి.

కాగా ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు కొత్తగా ఫేస్‌ రికగ్నిషన్‌ విధానం ద్వారా హాజరు నమోదు తీసుకొచ్చిన నేపథ్యంలో.. ఉద్యోగుల నుంచి దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అయినా ప్రభుత్వం దీనిపై ముందుకెళ్లడంతో తప్పనిసరై ఆమోదం తెలిపారు. అలాగే సీపీఎస్‌ రద్దు హామీని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడం, నిర్బంధాలు విధించడం, బైండోవర్లు చేయడంపై ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఉపాధ్యాయులు సెప్టెంబర్‌ 1వ తేదీన ‘చలో విజయవాడ’ పేరుతో నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వగా.. ప్రభుత్వం ఉద్యోగులకు నోటీసులు ఇవ్వడం, వారిని విజయవాడ రాకుండా అడ్డుకోవడం తెలిసిందే. వీటన్నింటినీ తీవ్రంగా పరిగణించిన ఉపాధ్యాయ సంఘాలు సెప్టెంబర్ 5న జరిగే ‘టీచర్స్ డే’ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =