ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, నంద్యాల సహా వివిధ పారిశ్రామిక ప్రాంతాల్లోని పరిశ్రమల్లో ఇటీవల వరుస ప్రమాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆగస్టు 4, మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమల తనిఖీల కోసం జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా మరో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
జిల్లాల పరిధిలో ప్రమాదకర రసాయనాలు, విషవాయువులు, పేలుడు పదార్ధాలు, రెడ్ కేటగిరీలకు సంబంధించిన అన్ని పరిశ్రమలను ఈ కమిటీ తనిఖీ చేయాలని పేర్కొన్నారు. ఒకవేళ పరిశ్రమల్లో ఏదైనా లోపాలను గుర్తిస్తే 30 రోజులలోగా వాటిని సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆయా పరిధిల్లో ప్రతీ పరిశ్రమను పరిశీలించడమే ప్రధాన ఉద్దేశంగా పెట్టుకుని, 90 రోజుల్లో ఈ ప్రత్యేక డ్రైవ్ పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu