వర్షాల వలన చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించండి : సీఎం జగన్

Andhra Pradesh CM, Andhra Pradesh Rains, Andhra Pradesh Rains News, ap cm ys jagan review on floods and rains, AP CM YS Jagan review over rains, AP Heavy Rains, CM YS Jagan Mohan Reddy review meeting, CM YS Jagan Review on Heavy Rains, Heavy Rains CM YS Jagan Review Meeting, Heavy Rains In AP, YS Jagan Review on Heavy Rains and Relief Measures

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితులపై క్యాంప్‌ కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్‌ పునరుద్ధరణ వేగవంతంగా చేపట్టాలని, అలాగే వర్షం వలన దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ పనులు కూడా త్వరితగతిన చేపట్టాలని అన్నారు. ఈ వర్షాల వల్ల వచ్చే వ్యాధులపై కూడా దృష్టి సారించాలని చెప్పారు.

తెలంగాణలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వస్తోందని చెప్పారు. గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. భారీ వర్షాల వలన వివిధ జిల్లాలలో చనిపోయిన 10 మంది కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. వర్షాల వల్ల కలిగిన నష్టంపై అంచనాలు వేసి వారం రోజుల్లోగా నివేదిక పంపించాలని చెప్పారు. మరోవైపు పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి అవసరమైన సాయం అందించాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ సూచించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 13 =