ఫేస్‌బుక్ న్యూస్, త్వరలో ఇండియాలో ప్రారంభం !

facebook, Facebook Considering to Launch New Product, Facebook Considering to Launch New Product Facebook News in India, Facebook India, facebook news, Facebook News in India, Facebook News launch, Facebook News Planned for Launch in India, facebook news service, facebook news today, facebook newsroom

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్‌బుక్‌ త్వరలో మరో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టనుంది. “ఫేస్‌బుక్ న్యూస్” పేరుతో పలుదేశాల్లో ప్రత్యేక వార్తా విభాగాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే జూన్ నెల నుంచి అమెరికాలో ఫేస్‌బుక్ వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వచ్చే ఆరు నెలల సమయంలో ఫేస్‌బుక్ న్యూస్ ను భారత్, యు.కె, జర్మనీ, ఫ్రాన్స్ మరియు బ్రెజిల్‌తో దేశాలలో ప్రారంభించేందుకు ఫేస్‌బుక్ ప్రణాళికలను సిద్ధం చేస్తునట్టు ప్రకటించారు.

ఫేస్‌బుక్‌ గ్లోబల్‌ న్యూస్‌ పార్టనర్‌షిప్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కాంప్‌బెల్‌ బ్రౌన్‌ వివిధ దేశాల్లో ఫేస్‌బుక్ న్యూస్ ఫీచర్ ను ప్రారంభించడంపై తన బ్లాగులో కీలక విషయాలు వెల్లడించారు. ప్రతి దేశంలో ఫేస్‌బుక్ న్యూస్ కు కంటెంట్ అందించే కంటెంట్‌ క్రియేటర్స్‌ మరియు పబ్లిషర్లకు కంపెనీ డబ్బు చెల్లిస్తుందని చెప్పారు. పలు దేశాల్లో ఉన్నఫేస్‌బుక్ వినియోగదారుల అభిరుచికి తగినట్లుగా న్యూస్ కంటెంట్ అందించి‌, ఈ విభాగంలో సరికొత్త బిజినెస్‌ మోడల్‌తో ముందుకు వెళ్లనున్నట్టు తెలిపారు. అమెరికాలో ఫేస్‌బుక్ న్యూస్‌కు మంచి ఆదరణ లభిస్తుండడంతో ఇతర దేశాల్లో కూడా త్వరలో ప్రారంభించేందుకు విధివిధానాల రూపకల్పనను ఫేస్‌బుక్ వేగవంతం చేసింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =